ప్రభుత్వ బడుల్లో 'మన బడి- మన భవిష్యత్తు' కింద మౌలిక వసతులు: మంత్రి లోకేశ్ 1 y ago
AP: వైసీపి ప్రవర్తనతో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. విద్యార్థులు సౌకర్యాలు లేక ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరారని పేర్కొన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ విధంగా సమాధానాలిచ్చారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు మాత్రమే చెప్పాలన్నది మా విధానం. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించి అన్ని వివరాలతో ఒకే యాప్ తీసుకొస్తున్నాం. మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసి విద్యాప్రమాణాలు పెంచుతున్నాం. 'మన బడి- మన భవిష్యత్తు' కింద మౌలిక వసతులు కల్పిస్తాం అని లోకేశ్ తెలిపారు.